CSK పేలవ ప్రదర్శన.. రైనాను ట్రోల్ చేసిన Yuvraj Singh

ABN , First Publish Date - 2022-05-14T00:19:16+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో

CSK పేలవ ప్రదర్శన.. రైనాను ట్రోల్ చేసిన Yuvraj Singh

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా నాలుగుసార్లు చాంపియన్ అయిన సీఎస్కే ప్లే ఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకుంది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ తన మాజీ సహచరుడు, చెన్నైకి చాలాకాలం పాటు ఆడిన సురేశ్ రైనాను ట్రోల్ చేశాడు. చెన్నై పేలవ ప్రదర్శనను గుర్తు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రైనాను ఉద్దేశించి.. ‘నీ జట్టు 97 పరుగులకే చాపచుట్టేసింది. దాని గురించి నువ్వేమంటావ్?’ అని ప్రశ్నించాడు. 


యువరాజ్ పోస్టుకు రైనా బదులిస్తూ ‘నేనా మ్యాచ్‌ను చూడలేదు పాజీ’ అని సింపుల్‌గా బదులిచ్చాడు. ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రైనా కీలక ఆటగాడిగా ఉండేవాడు. అయితే, ఈ సీజన్‌కు ముందే సీఎస్‌కే అతడిని వదిలేసుకుంది. మెగావేలంలోనూ అతడిని ఎవరూ తీసుకోలేదు. ఐపీఎల్‌లో రైనా 5,528 పరుగులు చేశాడు.

Read more