Abn logo
Aug 12 2020 @ 11:44AM

మీరు గెలుస్తారు: స‌ంజయ్‌ద‌త్‌కు ధైర్యం చెప్పిన యువ‌రాజ్‌

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌కు తెలియ‌జేశారు. సంజ‌య్ ఆరోగ్యంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆయ‌న‌లో ధైర్యాన్ని నింపే సందేశాన్ని పంపారు. యువరాజ్ కూడా 2011లో ఈ క్యాన్సర్‌తో బాధ‌ప‌డ్డారు. దానినుంచి కోలుకున్నాక తిరిగి క్రికెట్ బ్యాట్ ప‌ట్టారు. యువ‌రాజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో... సంజయ్ దత్... మీరు ఒక పోరాట యోధుడు. ఎప్పుడూ అలాగే ఉంటారు. క్యాన్స‌ర్‌ ఎంత బాధపెడుతుందో నాకు తెలుసు. అయితే మీరు ధైర్యంగా ఉంటార‌ని, ఈ కష్ట సమయాన్ని అధిగమిస్తారని న‌మ్ముతున్నాను. మీరు త్వరగా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement