యువరాజ్‌ సింగ్‌ అరెస్టు..బెయిల్‌

ABN , First Publish Date - 2021-10-18T08:06:29+05:30 IST

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు.

యువరాజ్‌ సింగ్‌ అరెస్టు..బెయిల్‌

చండీగఢ్‌: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది రోహిత్‌ శర్మతో జరిగిన లైవ్‌ చాటింగ్‌లో అతడు స్పిన్నర్‌ చాహల్‌ను ఉద్దేశించి ఓ కులం వారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టు ఫిర్యా దు నమోదైంది. దీంతో యువీ పై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని మూడు గంటలపాటు విచారించారు. అయితే పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు యువీకి మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. వచ్చే నెల 18న ఈ కేసు మరోసారి విచారణకు రానుంది.

Updated Date - 2021-10-18T08:06:29+05:30 IST