పీవీ సింధుకు యువరాజ్, రైనా బర్త్‌డే విషెస్

ABN , First Publish Date - 2020-07-06T02:23:38+05:30 IST

భారత బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధుకు క్రికెటర్లు యువరాజ్, సురేశ్ రైనా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా..

పీవీ సింధుకు యువరాజ్, రైనా బర్త్‌డే విషెస్

న్యూఢిల్లీ: భారత బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధుకు క్రికెటర్లు యువరాజ్, సురేశ్ రైనా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా ఆమెను  ప్రశంశించారు. దేశ గౌరవాన్ని పెంచుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు అభినందించారు. ‘జన్మదిన శుబాకాంక్షలు. ఈ ఏడాది కూడా నీవు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలి. నీ కీర్తి మరింత ఎత్తుకు ఎదగాలి. నీవు దేశం గర్విచదగ్గ విజయాలెన్నో సాధించి మరెన్నో పురస్కారాలను సొతం చేసుకోవాలి. కరోనా నుంచి సురక్షితంగా ఉండు’ అంటూ యువరాజ్ సింగ్ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చాడు. అదే విధంగా రైనా ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు సింధు. భారత్‌కు ప్రతినిథ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు. దేశానికే నీవు గర్వకారణం. ఇలానే మరెంతో మందికి మీరు స్ఫూర్తిని పంచాలని, మరింత కీర్తిని గడించాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-06T02:23:38+05:30 IST