యువ చైతన్యంతో టీడీపీ ప్రభంజనం

ABN , First Publish Date - 2021-01-24T05:40:32+05:30 IST

నారా లోకేష్‌ సారథ్యంలో యువ చైతన్యంతో టీడీపీ ప్రభంజనం కొనసాగబోతుందని పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు.

యువ చైతన్యంతో టీడీపీ ప్రభంజనం
రోగులకు పండ్లు పంపణీ చేస్తున్న డాక్టర్‌ ఉగ్ర




నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలో డాక్టర్‌ ఉగ్ర 

కనిగిరి, జనవరి 23 :  నారా లోకేష్‌  సారథ్యంలో యువ చైతన్యంతో టీడీపీ  ప్రభంజనం కొనసాగబోతుందని పార్టీ ఇన్‌చార్జి,  మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్కొన్నారు. లోకేష్‌ పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలో రోడ్ల వెంట మొక్కలు నాటారు. తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు,  రొట్టెలను ఆయన అందజేశారు. తెలుగుదేశం పార్టీలో యువకులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఉగ్ర అన్నారు.  రానున్న ఎన్నికల్లో  టీడీపీ సత్తాను చాటేలా యువ నాయకత్వం శ్రమించాలన్నారు.  స్థానిక ఎన్నికలంటే భయంతో వైసీపీ కుంటి సాకులు చెప్తోందని ఉగ్ర విమర్శించారు. ఉద్యోగులను అడ్డంపెట్టుకొని రాజ్యాంగ నిర్ణయాన్ని ధిక్కరిచేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  గతంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ దాడులు, భయబ్రాంతులు సృష్టించి ఏకగ్రీవాలకు పాల్పడిందన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, జగన్‌ పాలనలో అరాచకం పెచ్చురిల్లి ప్రజలు భయంతో జీవనం సాగిస్తున్నారని ఉగ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించి ఎన్నికలు సజావుగా జరిపించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఉగ్ర పేర్కొన్నారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో పుట్టిన రోజు కేక్‌ను కట్‌ చేశారు. కార్యక్రమంలో టీడీ పీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, జంషీర్‌ అహ్మద్‌, సందానీ, తమ్మినేని వెంకటరెడ్డి, బేరి పుల్లారెడ్డి, చిరంజీవి, రమేష్‌, బారా ఇమాం, పీర్ల బారా ఇమాం, ఇంద్రభూపాల్‌రెడ్డి, ఉండేల పిచ్చిరెడ్డి, పెన్నా కొండలు యాదవ్‌, ఫిరోజ్‌, ఎల్‌వీఆర్‌, బుజ్జా, జి చెన్నయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T05:40:32+05:30 IST