బాసర ట్రిపుట్ ఐటీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-06-18T23:57:01+05:30 IST

బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల చేస్తున్న ఉద్యమానికి...

బాసర ట్రిపుట్ ఐటీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్టీపీ నేతలు మద్దతు ప్రకటించారు. విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలోకి వెళ్లేందుకు యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని వైఎస్సీర్ టీపీ నాయకులు హెచ్చరించారు. 




Updated Date - 2022-06-18T23:57:01+05:30 IST