హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్టీపీ నేత తూడి దేవేందర్ రెడ్డి (Thudi Devender Eeddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...‘‘ఎవరి పిల్లలు త్యాగాలు చేస్తే..ఎవరి పిల్లలు భోగాలు అనుభవిస్తున్నారు’’ అంటూ ప్రశ్నించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేరస్థులను కాపాడే పని చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో ఉంటున్నాము అంటే తలదించుకునే పరిస్థితి ఉందన్నారు. జూబ్లీహిల్స్ అంటే పబ్‌లు, రేప్‌లకు అడ్డా అనే ముద్రపడుతోందని తెలిపారు. హైదరాబాద్ ఇమేజ్ ఏమవుతుందని ప్రశ్నించారు. ఒక్క రైతు బంధు ఇచ్చి అన్ని సమస్యలు వదిలేస్తారా? అని నిలదీశారు. అవినీతి పాలనకు, ప్రజాస్వామ్య పాలనకు తెలంగాణ దిక్సూచి అని దేవేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి