విద్యార్థుల భవిష్యత్‌పై సీఎం కేసీఆర్‌కు ఆలోచన లేదా?: Sharmila

ABN , First Publish Date - 2021-10-12T16:58:58+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ....బీరుల తెలంగాణగా మార్చారన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌పై సీఎం కేసీఆర్‌కు ఆలోచన లేదా?: Sharmila

నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ....బీరుల తెలంగాణగా మార్చారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 33 శాతం, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ‘‘విద్యార్థుల భవిష్యత్‌పై సీఎం కేసీఆర్‌కు ఆలోచన లేదా?....మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా’’ అని ప్రశ్నించారు. బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా అని నిలదీశారు. ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆర్‌ఎస్ నాయకుల కన్ను పడిందని ఆరోపించారు.12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. ముస్లింలకు ఎక్కువగా ద్రోహం చేసింది సీఎం కేసీఆరే అని షర్మిల వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-10-12T16:58:58+05:30 IST