తండ్రి ప్రోద్భలంతోనే వనమా రఘవ దారుణాలకు ఒడిగట్టాడు: Sharmila

ABN , First Publish Date - 2022-01-07T19:21:05+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవపై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల విరుచుకుపడ్డారు.

తండ్రి ప్రోద్భలంతోనే వనమా రఘవ దారుణాలకు ఒడిగట్టాడు: Sharmila

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవపై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘టీఆర్ఎస్ లీడ‌ర్ అరాచ‌కాల‌కు నిండు కుటుంబం బ‌లైంది. ఎన్నో క‌ల‌లు గ‌న్న త‌ల్లిదండ్రులు లోకాన్ని విడిచారు.బంగారు భ‌విష్య‌త్తు ఉన్న పసి పిల్ల‌లు అగ్నికి ఆహుత‌య్యారు. ఇలాంటి దుర్మార్గున్ని వ‌దిలిపెట్ట‌కూడ‌దు. త‌న తండ్రి ఎమ్మెల్యే వ‌న‌మా ప్రోద్బ‌లంతోనే ఇలాంటి దారుణాల‌కు ఒడిగట్టాడు.  గతంలోనూ వనమా రాఘవ ఆగడాలకు వడ్డీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భూకబ్జాలు, సెటిల్ మెంట్లతో ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. ఇలాంటి నీచుడికి వెంటనే ఉరి శిక్ష వేయాలి. ఎమ్మెల్యే వ‌నమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలి. రాజ‌కీయాల‌ నుంచి వెంటనే త‌ప్పుకోవాలి’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-01-07T19:21:05+05:30 IST