Advertisement
Advertisement
Abn logo
Advertisement

వడ్లు కొనడం చేతకానప్పుడు అధికారం మీకెందుకు?: Sharmila

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారన్నారు. కేంద్రం కొనట్లేదని రైతును నట్టేట ముంచుతారా అని ప్రశ్నించారు. ‘‘వడ్లు కొనడం చేతకానప్పుడు అధికారం మీకెందుకు?’’ అని నిలదీశారు. రైతుల వడ్లు కొననప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఏం లాభమన్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లిస్తామన్నది తమ కమీషన్ల కోసమేనా అని మండిపడ్డారు. ఆకుపచ్చ తెలంగాణ అంటే రైతు జీవితాలను ఆగం చేయడమేనా అని అన్నారు. కేసీఆర్ రైతులను కోటీశ్వరులను చేస్తే.. 8వేల మంది రైతులు ఎందుకు చనిపోయారని ప్రశ్నించారు.  వడ్లు కొనలేనప్పుడు సీఎం పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement