Advertisement
Advertisement
Abn logo
Advertisement

నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా?: Sharmila

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిడ్డ ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతేనే..కేసీఆర్ గుండె తల్లడిల్లిందని అన్నారు. బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టేందుకు కేసీఆర్‌ రెడీగా ఉన్నారని మండిపడ్డారు. అయితే నోటిఫికేషన్స్ లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని... రోజుకో నిరుద్యోగి చనిపోతుంటే దొరకు కనపడట్లేదని వ్యాఖ్యానించారు.  నిరుద్యోగులను బలితీసుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని ఆరోపించారు. ‘‘నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా’’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement