కేసీఆర్‌వి గప్పాలు కొట్టుడే: షర్మిల

ABN , First Publish Date - 2022-01-05T23:39:02+05:30 IST

గప్పాలు కొట్టుడే కాని రైతును ఆదుకోవడం చేతకాని

కేసీఆర్‌వి గప్పాలు కొట్టుడే: షర్మిల

హైదరాబాద్: గప్పాలు కొట్టుడే కాని రైతును ఆదుకోవడం చేతకాని సీఎం కేసీఆర్ మనకొద్దని వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు  షర్మిల అన్నారు. కడుపులో కత్తి దించి కౌగిలించుకొన్నట్టు  రైతులపై కేసీఆర్ ప్రేమ ఉందని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  రైతులకు ఇచ్చేది ఒక్కటే రైతుబందు అని, సర్వరోగ నివారిణి రైతుబంధు అన్నట్లు రైతులకు సాయం చేసే మిగిలిన అన్ని పథకాలను బంద్ పెట్టారన్నారు. రైతులకు 25వేలిచ్చే దగ్గర 5వేలే ఇచ్చి నష్టం చేశారన్నారు. వరి వేస్తే ఉరేనని, రైతుబంధు పైసలు ఇచ్చేది లేదని చెప్పారన్నారు. అయితే వ్యతిరేకత రావడంతో ప్రతి ఒక్కరికి ఇస్తామని వారోత్సవాలు చేసుకొంటున్నారని ఆమె  పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-05T23:39:02+05:30 IST