మద్దుత ధర కల్పించని సీఎం ఎందుకు?: Sharmila

ABN , First Publish Date - 2022-04-27T18:03:23+05:30 IST

రైతులకు మద్దతు ధర కల్పించని ముఖ్యమంత్రి ఎందుకు...యంత్రాంగం ఎందుకని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

మద్దుత ధర కల్పించని సీఎం ఎందుకు?: Sharmila

భద్రాద్రి కొత్తగూడెం: రైతులకు మద్దతు ధర కల్పించని ముఖ్యమంత్రి ఎందుకు... యంత్రాంగం ఎందుకని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బుధవారం బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజార గ్రామంలో రైతు గోస దీక్షలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళలో తమ పక్కన ఎవరు ఉన్నారని నిలదీశారు. ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళలో సగం మందిని ఉద్యమంలో చనిపోలేదని వెళ్లగొట్టారన్నారు. ఉద్యమంలో కాళ్ళు, చేతులు పోగొట్టుకున్న వాళ్ళలో ఎంత మందిని ఆదుకున్నారని అడిగారు. ఉద్యమ ఆకాంక్షలకు కూడా గౌరవం లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం.. టీఆర్‌ఎస్ నేతలు మాత్రమే బాగుపడ్డారన్నారు. ఇంటికో ఉద్యోగం అని చెప్తే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారని షర్మిల తెలిపారు.


త్యాగాలు చేసింది వారు కదా... ఆత్మబలిదానం చేసుకున్నది వారు కదా అని అన్నారు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచి పోయినట్లు నాటకం ఆడింది తమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డాలు పెంచుకొని దీక్షలు చేసినట్లు దొంగ నాటకాలు ఆడారన్నారు. రక్తాన్ని పిండుతున్నారని... నడ్డి విరుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యం కాదని.. దొంగల రాజ్యం... రౌడీల రాజ్యమన్నారు. స్వార్థం కోసం సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి వారి శవాల మీద సింహాసనం వేసుకొని కూర్చున్నారని విమర్శించారు. కేసీఆర్ ఒకప్పుడు స్కూటర్‌లో తిరిగే వారని...ఇప్పుడు ప్రైవేట్ జెట్ ఉందన్నారు. ఎవరు తిన్నారు తెలంగాణ సొమ్ము.. దోచుకొని తిన్న సొమ్ము కాదా అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. 

Updated Date - 2022-04-27T18:03:23+05:30 IST