రాజీనామాకు సిద్ధమైన YSRCP మహిళానేత.. కారణమిదీ..

ABN , First Publish Date - 2022-04-26T12:04:59+05:30 IST

రాజీనామాకు సిద్ధమైన YSRCP మహిళానేత.. కారణమిదీ..

రాజీనామాకు సిద్ధమైన YSRCP మహిళానేత.. కారణమిదీ..

  • దోసపాడు ఎంపీటీసీ సభ్యురాలు రాజీనామాకు సిద్ధం
  • వైసీపీ నేతలు దళితులను అణగదొక్కుతున్నారని ఆరోపణ

కృష్ణా/పెదపారుపూడి : వైసీపీకి చెందిన దోసపాడు ఎంపీటీసీ సభ్యురాలు తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం కావడం చర్చనీయాంశమైంది. ఎంపీటీసీ సభ్యురాలు చిగురుపాటి అశోక్‌ కుమారి విలేకరులతో మాట్లాడుతూ తన భర్త శ్రీధర్‌, తాను వైసీపీ  ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నామన్నారు. మండల నాయకులు ప్రోత్సాహం ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌పై ఉన్న అభిమానంతో పార్టీనే నమ్ముకుని ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు.


ఈ నెల 23న దోసపాడులో వలంటీర్లీ సన్మాన కార్యక్రమం సందర్భంగా తాము ఏర్పాటు చేసిన స్వాగత ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారన్నారు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. వైసీపీలోని కొంత మంది ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారన్నారు.   వైసీపీలోనే మండల నాయకులు కొంత మంది దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిం చారు. ఈ సంఘటనపై స్పందించకపోవటంతో  ఎంపీటీసీ  పదవికి మంగళవారం రాజీనామా చేసి పత్రాలను జడ్పీ సీఈవోకు, ఎంపీడీవోకు పంపడం జరుగుతుందన్నారు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం చేస్తానన్నారు.

Updated Date - 2022-04-26T12:04:59+05:30 IST