Breaking: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-02T02:33:04+05:30 IST

వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనకు వ్యక్తిగత ఓటింగ్ ఉందని..

Breaking: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన జగన్.. అసలేం జరిగిందంటే..

అమరావతి: వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనకు వ్యక్తిగత ఓటింగ్ ఉందని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించిన 24 గంటల్లోపే జగన్ కొత్తపల్లిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. క్రమశిక్షణ సంఘం సిఫార్సుతో జగన్ కొత్తపల్లిని సస్పెండ్ చేశారు.


మంగళవారం (31-05-2022) కొత్తపల్లి ఏం మాట్లాడారంటే..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘నాకు టిక్కెట్‌ కావాలని ఏ పార్టీని అడగలేదు. నాకంటూ వ్యక్తిగత ఇమేజ్‌ ఉంది. అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరిస్తారు. గౌరవిస్తారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలుస్తా. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా ? ఇతర పార్టీలకు మద్దతుగా ఉంటానా ? అని ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకే క్లారిటీ ఇస్తున్నా. నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటుపై ప్రజల తరపున ఉద్యమిస్తే.. నాపై ఏ 1 ముద్దాయిగా కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఎవరిని బెదిరించలేదు. గొడవలు సృష్టించ లేదు. శాంతియుతంగా ఉద్యమించా. నాపై ఏ కేసు పెట్టినా పట్టించుకోను. ప్రజల మధ్యనే ఉంటా.. సమస్యలపై పోరాటం చేస్తా’ అని సుబ్బారాయుడు స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-02T02:33:04+05:30 IST