కోట్ల ఆస్తిపాస్తుల కన్నా చదువే మిన్న.. : YSRCP MLA

ABN , First Publish Date - 2022-05-09T19:58:46+05:30 IST

కోట్ల ఆస్తిపాస్తుల కన్నా చదువే మిన్న.. : YSRCP MLA

కోట్ల ఆస్తిపాస్తుల కన్నా చదువే మిన్న.. : YSRCP MLA

ఏలూరు : ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) ఉన్నత విద్యలో విద్యా విప్లవం వచ్చింది కేవలం దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం వల్లేనని వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (YSRCP MLA Tellam Balaraju) తెలిపారు. ఈ రాష్ట్ర చిన్నారులకు తానిచ్చే ఆస్తి ఏమైనా ఉందంటే అది కేవలం చదువేనని ఈ దేశంలోనే మొదటిసారిగా చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని ఆయన పేర్కొన్నారు. సోమవారం నాడు బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన పోలవరం నియోజకర్గస్థాయి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.


పెద్ద కంపెనీకి సీఈవోగా..!

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘కేవలం ఉన్నత సంపన్నులకు మాత్రమే పరిమితమైన వైద్య, సాంకేతిక విద్యలను నిరుపేద SC, ST, BC, మైనారిటీ, EBC పిల్లలకు చేరువ చేసిన ఘనత కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్లే ఈ రోజు పేద పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఈ రోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు, పదవులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చదువుకునే  SC, ST, BC, మైనారిటీ, EBC పిల్లలు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడుకుడదని వారికి మనం కల్పించే ఆస్తి చదువేనని పట్టువదలని సంకల్పంతో విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన లతో వారి కాలేజ్, హాస్టల్ ఫీజులను నేరుగా వారి తల్లిదండ్రులు ఏకౌంట్లకు జమ చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి నేను చదువుకునే కాలంలో ఉండి ఉంటే నేను కూడా బాగా చదువుకుని ఏదైనా పెద్ద కంపెనీకి సీఈవో(CEO స్థాయిలో ఉండేవాడిని అని అనిపిస్తోంది’ అని బాలరాజు తెలిపారు. కోట్ల ఆస్తిపాస్తుల కన్నా చదువే మిన్న అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.


విద్యార్థులు అందరూ చక్కగా చదువుకుని ఉన్నత విద్యావంతులు అవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కాగా.. పోలవరం నియోజవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ పిల్లలకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద మొత్తం 7,288 విద్యార్థులకు గాను రూ.31,76 వేలు జమచేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ నూతన పీఓ మురళి, అధికారులు, ప్రజా ప్రతినిదులు, నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read more