Advertisement
Advertisement
Abn logo
Advertisement

సొంత పార్టీ వ్యక్తులే YSRCP ఫ్లెక్సీ చించివేత..

చిత్తూరు జిల్లా/కార్వేటినగరం : కార్వేటినగరం మండలం అలత్తూరులో వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని అదే పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు చించివేశారు. స్థానిక వరద వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన కోసం టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రాక సందర్భంగా గ్రామంలో వైసీపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో తమ ఫొటోలు లేవని, అదే పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దానిని చించివేశారు. వైసీపీకి చెందిన ఒక వర్గం ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని మరో వర్గం చించివేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement