దీమా తగ్గిన భీమా

ABN , First Publish Date - 2020-10-17T11:19:59+05:30 IST

సామాజిక భద్రతా పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోతలు విధిస్తోంది. ఒకప్పుడు కుటుంబం మొత్తానికి వర్తించే బీమా ఇప్పుడు ..

దీమా తగ్గిన భీమా

వైఎస్‌ఆర్‌ పేరుతో భారీ కోతలు


ఏలూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి):సామాజిక భద్రతా పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా కోతలు విధిస్తోంది. ఒకప్పుడు కుటుంబం మొత్తానికి వర్తించే బీమా ఇప్పుడు వారిలో ఒక్కరికి మాత్రమే వర్తింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది. కార్మి కులకు సామాజిక భద్రత కల్పించే బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. వైఎస్సార్‌ బీమాగా పేరు మార్చడంతోపాటు ప్రయోజనాల్లో కోత విధిస్తూ సవ రణలు చేసింది. ఊహించని విధంగా కోత పడడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు


చంద్రన్న బీమా ఇలా

2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభిం చింది. 18 నుంచి 70 ఏళ్లలోపు వయసు న్న రేషన్‌ కార్డులోని కుటుంబ సభ్యులంద రికీ ఈ పథకాన్ని వర్తింపజేసింది. కేవలం 15 రూపాయల ప్రీమియంతో ఈ పథకాన్ని అమలు చేశారు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న వారికి సహజ మరణానికి రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్లలోపు వారు మరణిస్తే రూ.30 వేలు చెల్లించేవారు. 60 దాటిన వారికి  పరి హారం లభించేది కాదు. ప్రమాదంలో మరణిస్తే 18-70 ఏళ్ల వర కూ రూ.5 లక్షలు అందించేవారు. బీమా మిత్ర వ్యవస్థను ఏర్పా టుచేసి సాయం సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. 


వైఎస్సార్‌ కోతలు ఇలా..

జగన్‌ ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేసి వైఎస్సార్‌ బీమా పేరు తో అమలులోకి తెచ్చింది. ఇంటింటి సర్వే నిర్వహించి ఇంట్లో సంపాదనకు కీలకమైన వ్యక్తుల వివరాలు సేకరించింది. కుటుం బపెద్దకే పథకాన్ని వర్తింపజేస్తూ పేర్లు నమోదు చేస్తున్నారు. జిల్లాలో 9,72,000 కుటుంబాలను గుర్తించి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఈ కుటుంబాల్లో సంపాద నాపరుల్లో ఒక్కరికి మాత్రమే పథ కం వర్తిస్తుంది. నమోదైన పేరు మినహా మిగిలిన వారు ఎవరైనా చనిపోతే వారికి పథకం వర్తించదు. సహజ మరణానికి చెల్లించే పరిహారంలోను మార్పులు తీసుకు వచ్చారు. 18-50 ఏళ్లలోపు మరణిం చినవారికి రూ.2 లక్షల పరిహారం ఇచ్చేవారు. దీంతోపాటు 51 నుంచి 60 ఏళ్లలోపు వారు సహజంగా మరణిస్తే నాడు రూ.30 వేలు పరిహారం వచ్చేది. ఇకపై అది రాదు. ప్రమాద బీమా కూడా 18-70 ఏళ్లలోపు వారికి రూ.5 లక్షలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ పరిహారం 50 ఏళ్ల వరకే పరిమితం చేశారు. 50-60 ఏళ్లలోపు వారు ప్రమాదానికి గురై మరణిస్తే వారికి ఇకపై రూ.3 లక్షల సాయం అందిస్తారు. 


 ప్రభుత్వం పునరాలోచించాలి

‘ప్రభుత్వం మారినప్పుడల్లా పథకాలను మారుస్తూ పోతే ఎలా? ఆ అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారు. ఇలా మార్చు కు నే అధికారం లేకుండా శాశ్వతంగా ఉండేలా పథకాన్ని రూపొం దించాలి. ప్రయోజనాల్లో కోతలు విధిస్తే కార్మికులకు తీరని అన్యాయం చేసినట్లే. ప్రభుత్వం పునరాలోచించి పాత ప్రయోజ నాలను పునరుద్ధరించాలి.’ అని సీఐటీయూ నేత డీఎన్‌వీడీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.


సభ్యులు           సహజ మరణం          ప్రమాద మరణం

వయసు చంద్రన్న బీమా    వైఎస్సార్‌ బీమా        చంద్రన్న       వైఎస్సార్‌

18-50 రూ. 2 లక్షలు        రూ. 2 లక్షలు రూ. 5 లక్షలు   రూ. 5 లక్షలు

51-60 రూ. 30 వేలు        పరిహారం లేదు రూ. 5 లక్షలు   రూ. 3 లక్షలు

61-70 పరిహారం లేదు      పరిహారం లేదు రూ. 5 లక్షలు   రూ. 3 లక్షలు

Updated Date - 2020-10-17T11:19:59+05:30 IST