లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్ పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే కాకాణి
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి
వెంకటాచలం, జనవరి 25 : మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు అదనంగా మరెన్నో హామీలు అమలు చేస్తూ ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాల వారికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ సరస్వతీనగర్ వద్ద ఉన్న కమ్యూనిటీ కేంద్రంలో మంగళవారం వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 2,193 మంది మహిళలకు అందిస్తున్న రూ.3కోట్ల 29లక్షల చెక్కును ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు రిజిస్ర్టేషన్ పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ మందా కవితా, వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, తహసీల్దారు ఐఎస్ ప్రసాద్, ఎంపీడీవో ఏ సరళ, గృహనిర్మాణ శాఖ ఏఈ సీహెచ్. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, పలువురు వైసీపీ నాయకులున్నారు.