1.72 లక్షల మందికి వైఎస్‌ఆర్‌ ‘చేయూత’

ABN , First Publish Date - 2020-08-13T06:47:41+05:30 IST

వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా జిల్లాలోని 1,71,802 మంది లబ్ధిదారులకు రూ.322.13 కోట ఆర్థిక సహ కారం అందించామని జిల్లా కలెక్ట

1.72 లక్షల మందికి వైఎస్‌ఆర్‌ ‘చేయూత’

జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు


ఏలూరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా జిల్లాలోని 1,71,802 మంది లబ్ధిదారులకు రూ.322.13 కోట ఆర్థిక సహ కారం అందించామని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు చెప్పారు. వెలగ పూడి నుంచి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించారు. వీసీ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు ఎంఎల్‌సీ రాము సూర్యారావు, జేసీ (సంక్షేమం) నంబూరి తేజ్‌భరత్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విలేకరులతో మాట్లాడుతూ నవరత్నాల పథకాలలో భాగంగా మహిళలకు చేయూత అందించి వారి జీవనోపాధి పెంపొందిం చేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. 


 వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందిస్తూ రాష్ట్రంలో సుమారు 23 లక్షల మందికి ఈ నాలుగేళ్లలో రూ.17 వేల కోట్లు సాయం అందనున్నట్టు తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల జీవితాల్లో మార్పు తేవడమే సీఎం లక్ష్యమన్నారు.  

Updated Date - 2020-08-13T06:47:41+05:30 IST