వైఎస్సార్‌ చేయూత పథకం రెండో ద శ సొమ్ములు విడుదల

ABN , First Publish Date - 2021-06-23T07:06:56+05:30 IST

జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్యగల 2,35,789 మంది మహిళలు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.423,35 కోట్ల మేర లబ్ధి పొందుతున్నట్టు కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలి పారు.

వైఎస్సార్‌ చేయూత  పథకం రెండో ద శ సొమ్ములు విడుదల
చేయూత పథకం లబ్ధిదారులకు సొమ్ము విడుదల చేస్తున్న కలెక్టర్‌, ఎంపీ, జేసీ

భానుగుడి (కాకినాడ), జూన్‌ 22: జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్యగల 2,35,789 మంది మహిళలు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.423,35 కోట్ల మేర లబ్ధి పొందుతున్నట్టు కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలి పారు. మంగళవారం సీఎం జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్‌ చేయూత పఽథకం ద్వారా రెండో ఏడాది మహిళల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో ప్రారంభించగా, కలెక్టరేట్‌ కార్యాలయంలో వివేకానంద హాల్‌ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి, జేసీ (ఆసరా-సంక్షేమం) జి రాజకుమారి, వివిధ ప్రాంతా లకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద 60,858 మంది ఎస్సీ లబ్ధిదారులకు, 3,707 మైనారిటీ లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఆసక్తి ఉన్నవారు కిరాణా షాపులు ఏర్పాటు చేసుకునేందుకు, గేదెలు, ఆవులు, మేకలు వంటి యూనిట్లను పంపిణీ చేసి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తోడ్పాటు నందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ కె.శ్రీరమణి, బీసీ, ఎస్సీ, కార్పొ రేషన్‌ ఈడీలు ఎస్‌వీఎస్‌ సుబ్బలక్ష్మి, జీఎస్‌ సునీత, మైనార్టీ సంక్షేమ అధికారి పీఎస్‌ ప్రభాకరరావు, వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T07:06:56+05:30 IST