రూ.220.92 కోట్ల చేయూత

ABN , First Publish Date - 2022-09-24T05:18:52+05:30 IST

జిల్లాలో వైఎస్‌ఆర్‌ చేయూ త పథకం మూడో విడత సాయం కింద లక్షా 17 వేల 826 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ.220.92 కోట్లను మహి ళల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని జేసీ పి.అరుణ్‌బాబు తెలిపారు.

రూ.220.92 కోట్ల చేయూత
చెక్కు అందజేస్తున్న జేసీ అరుణ్‌బాబు, ఎమ్మెల్యే డీఎన్‌ఆర్‌

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 23:జిల్లాలో వైఎస్‌ఆర్‌ చేయూ త పథకం మూడో విడత సాయం కింద లక్షా 17 వేల 826 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ.220.92 కోట్లను మహి ళల బ్యాంకు ఖాతాలకు జమ చేశామని జేసీ పి.అరుణ్‌బాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు ద్వారా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, చేయూత లబ్ధిదారు లతో కలిసి కుప్పం నుంచి సీఎం జగన్మోహన్‌రెడ్డి పథకం ప్రారంభ ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కిన అనంతరం, జిల్లా లబ్ధిదారులకు జమ చేసిన నగదు నమూనా చెక్కును అందజేశారు. జేసీ మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగడానికి చిన్న తరహా వ్యాపారాలు, పాడి గేదెలు, ఇతర వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ జీవనోపాధిని మెరుగు పర్చుకోవాలన్నారు. చింతలపూడి, దెందులూరు, గోపాల పురం, ద్వారకా తిరుమల, కైకలూరు, నూజివీడు, పోలవరం, ఉంగుటూరు నియోజక వర్గాల్లోని మహిళలకు నగదు జమ చేసినట్లు తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, మైనార్టీ సంక్షేమశాఖ పీడీ కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-24T05:18:52+05:30 IST