వివేకా హత్య కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

ABN , First Publish Date - 2022-01-12T00:41:53+05:30 IST

వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డికి పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. గత రిమాండ్‌ ముగియడంతో..

వివేకా హత్య కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

కడప: వైఎస్‌ వివేకా హత్య కేసు నిందితులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డికి పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. గత రిమాండ్‌ ముగియడంతో వీరిని అధికారులు తాజాగా కోర్టులో ప్రవేశపెట్టారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 25 వరకు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డికి రిమాండ్ పొడిగించింది. దీంతో వీరిని జైలుకు తరలించారు. 


2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి పులివెందులలోని ఆయన నివాసంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును తొలుత సిట్ పోలీసులు విచారించారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అభ్యర్ధనతో కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐకు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలంతో నిందితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు. వీరి రిమాండ్ గడువు తాజాగా ముగిసింది. దీంతో నిందితులకు మరోసారి రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-01-12T00:41:53+05:30 IST