కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 112వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ సాగుతోంది. నేడు సీబీఐ విచారణకు వేముల జడ్పీటిసీ బయపురెడ్డి హాజరయ్యారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి బయపురెడ్డి అనుచరుడు. మరి కొంతమంది అనుమానితులను కూడా సీబీఐ విచారించే అవకాశం ఉంది.