కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 94వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ జరుగుతోంది. నేడు వివేకా సోదరుడు వైఎస్ సుదీకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యకు ముందు కుటుంబ విషయాలపై సుధీకర్రెడ్డిని సీబీఐ అధికారులు క్షుణ్ణంగా అడుగుతున్నట్లు సమాచారం. వైఎస్ సుధీకర్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్త.