వివేకా హత్య కేసు.. నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , First Publish Date - 2022-01-19T03:56:38+05:30 IST

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ హైకోర్టులో జరిగింది. ఏ3 నిందితుడు ఉమా శంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ కౌంటర్ రికార్డుల్లో..

వివేకా హత్య కేసు.. నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి: వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ హైకోర్టులో జరిగింది. ఏ3 నిందితుడు ఉమా శంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ కౌంటర్ రికార్డుల్లో లేకపోవడంతో విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.


ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను ఇప్పటికే కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు వీలు లేదని సీబీఐ వాదించింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కీలక నిందితుడు కావడంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని సీబీఐ తెలిపింది. కడప కోర్టు కూడా బెయిల్‌ తిరస్కరించిందని సీబీఐ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ వాదనతో ఏకీభవిస్తూ శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.



Updated Date - 2022-01-19T03:56:38+05:30 IST