గౌరవాధ్యక్షురాలుగా తల్లి విజయమ్మ కొనసాగితే జగన్‌కు ఇబ్బందేంటి?

ABN , First Publish Date - 2022-07-08T02:17:50+05:30 IST

వైఎస్ విజయమ్మ సాగనంపేందుకు జగన్ ఎత్తుగడ వేశారు. ఆమెతోనే స్వయంగా రాజీనామా చేయించే విధంగా...

గౌరవాధ్యక్షురాలుగా తల్లి విజయమ్మ కొనసాగితే జగన్‌కు ఇబ్బందేంటి?

అమరావతి/హైదరాబాద్: వైఎస్ విజయమ్మ (Ys Vijayamma) సాగనంపేందుకు సీఎం జగన్ (Cm Jagan) ఎత్తుగడ వేశారు. ఆమెతోనే స్వయంగా రాజీనామా చేయించే విధంగా జగన్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్లీనరీ (Ycp Plenary) సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (Acharya Nagarjuna University) ఎదురుగా ఈ సమావేశాలు జరగనున్నాయి. వైఎస్ జయంతోత్సవాల సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయకు వెళ్లి అక్కడ నుంచి నేరుగా వచ్చి ప్లీనరీ సమావేశాలు ప్రారంభిస్తారు.


అయితే విజయమ్మ తెలంగాణ (Telangana)లో వైఎస్సార్‌టీపీ (Ysrtp)కి గౌరవ అధ్యక్షురాలిగా ఉండడంతో రెండు రాష్ట్రాల్లో ఉండడం కుదరదనే ఉద్దేశంతో ఆమెను తప్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయలక్ష్మిని తొలగించాలంటే పార్టీ రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దీనిపై న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. 


ఈ నేపథ్యలో ‘‘చెల్లితో పాటు తల్లిని కూడా జగన్ ఎందుకు వదిలించుకున్నారు?. రాజీనామా చేయమంటూ లేఖ ద్వారా కబురంపటం వెనక కారమేంటి?. గౌరవాధ్యక్షులుగా తల్లి విజయమ్మ కొనసాగితే జగన్‌కు ఇబ్బందేంటి?. పార్టీ విషయంలో భారతి (Barati)కి అడ్డంకులు లేకుండా చేయడమే లక్ష్యమా?. తాను జైలుకు వెళితే పార్టీని బీజేపీ లాగేసుకుంటుందని జగన్ భయమా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-07-08T02:17:50+05:30 IST