వివేకానందరెడ్డి హత్య నిగ్గుతేల్చాల్సిందే: వైఎస్ విజయలక్ష్మి

ABN , First Publish Date - 2021-04-06T01:30:47+05:30 IST

మాజీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య నిగ్గుతేల్చాల్సిందేనని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. ఈ హత్యపై సీఎం జగన్‌

వివేకానందరెడ్డి హత్య నిగ్గుతేల్చాల్సిందే: వైఎస్ విజయలక్ష్మి

అమరావతి: మాజీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య నిగ్గుతేల్చాల్సిందేనని వైఎస్ విజయలక్ష్మి అన్నారు. ఈ హత్యపై సీఎం జగన్‌, షర్మిల, తనిది ఒకే మాట అని స్పష్టం చేశారు. ఇటీవల తిరుపతి ఎన్నికల ప్రచారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్యకు గురైతే ఇప్పటివరకు ఎవరు చంపారో తెలియకపోవడం విచారకరమని విమర్శించారు. పవన్ వ్యాఖ్యలపై విజయలక్ష్మి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. సీబీఐ విచారణ కేంద్ర ప్రభుత్వానిదని, పవన్‌ విమర్శలు అర్ధరహితమని లేఖలో విజయలక్ష్మి కొట్టిపారేశారు. 


ఇటీవల వివేకానందరెడ్డి హత్యకేసులో జరుగుతున్న విచారణపై ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర మనోవేదన చెందుతున్నారు. హత్య జరిగి రెండేళ్లు దాటినా ఇంతవరకు హంతకులను పట్టుకోలేదని వాపోయారు. ఈ విషయంపై ఆమె నేరుగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల్లో కొందరిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి పేర్లను కూడా.. తాను హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నానని తెలిపారు. వైఎస్ షర్మిల మద్దతు తమకు ఉందని ప్రకటించారు. అంతేకాదు కుటుంబ సభ్యుల్లో కొందరి మద్దతు కూడా తమకుందని పేర్కొన్నారు. జగన్‌ సీఎంగా ఉన్నా కేసు ఎందుకు ముందుకెళ్లడం లేదో.. ఆయన్నే అడిగితే బాగుంటుందని సునీతారెడ్డి చెప్పారు.

Updated Date - 2021-04-06T01:30:47+05:30 IST