Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లకు మా అవసరం లేదు కదా.. Open Heart With RK లో YS Sharmila Reddy

twitter-iconwatsapp-iconfb-icon
ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లకు మా అవసరం లేదు కదా.. Open Heart With RK లో YS Sharmila Reddy

నాన్న చనిపోయాక తొమ్మిది నెలలు విపరీతంగా బాధపడ్డాను..

‘నేనెందుకు బతికున్నాను? ఆ చాపర్‌లో నేనెందుకు లేను?’ అంటూ అమ్మ బాధపడేది

నాకు అసలు రాజకీయాలంటేనే ఇష్టం ఉండదు.. కానీ డిజైర్ వల్ల రావాల్సి వచ్చింది

రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉంది. కావాలంటే మెడ తీసేయగలడు

తెలంగాణ వ్యతిరేకి అన్నది వైఎస్సార్‌పై టీఆర్ఎస్ వేసిన ముద్ర

నాకు, అన్నకు మధ్య వంద ఉండవచ్చు.. వెయ్యి ఉండవచ్చు..

నేను తెలంగాణలో పార్టీ పెడతానంటే వాళ్లు వద్దన్నారు..

నేను వైసీపీలో కనీసం సభ్యురాలిని కూడా కాదు..

అనిలే ముందు నాకు ప్రపోజ్ చేశాడు.. కానీ ఇంట్లో నాన్న ఒప్పుకోలేదు

అన్నా.. మీరు పాత వీడియోలు చూడండి.. ప్రేయర్‌లో ఎప్పుడూ మాట్లాడలేదు

ఏ కారణం వల్ల అయినా జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉండలేకపోతే..

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 


వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసురాలిగా, జగన్‌ సోదరిగా, తెలంగాణ ఆడబిడ్డగా, వైఎస్సార్‌టీపీ అధినేత్రిగా విభిన్న పాత్రల్లో ఒదిగిపోతున్న నవతరం నాయకి వైఎస్‌ షర్మిల. ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన వ్యక్తిగత, రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. సెప్టెంబర్ 26వ తారీఖున జరిగిన ఈ కార్యక్రమ పూర్తి వివరాలు మీకోసం..


ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షమే లేదు. ఈ రోజు కాంగ్రెస్‌... పార్టీగా కాకుండా ‘కాంగ్రెస్‌ సప్లయింగ్‌ కంపెనీ’గా మారింది. కేసీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్‌. అది ప్రతిపక్షమెలా అవుతుంది? బీజేపీ అంటారా..! బండి సంజయ్‌ గారేమో కేసీఆర్‌ అవినీతి మీద నా దగ్గర వంద ఆధారాలున్నాయంటారు. ఒక్కటి కూడా బయటపెట్టరు. 


ఒకరు చెబితే తీసుకున్న నిర్ణయం కాదు నాది. ఎంతో పరిశోధన చేసి, ఎంతో మందితో మాట్లాడిన తరువాత, ఎంతో లోతుగా ఆలోచించి, ఎన్నిటినో పరిగణనలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయం. వాళ్లకు నచ్చలేదు. చర్చలు జరిగాయి. వాళ్ల అభిప్రాయం వాళ్లు చెప్పారు. నా నిర్ణయం నేను చెప్పాను. కానీ బాధ ఎక్కడ కలిగిందంటే... మీరన్నట్టు రామకృష్ణారెడ్డి అన్న ‘సంబంధంలేదు’ అని మాట్లాడినందుకు. నేను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున ‘సంబంధం లేదు’ అన్న పదం వాడారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేశాను.


రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు... మెడ తీసేయగలడు. అలాంటివాడు కేసీఆర్‌ మాట వింటాడా? కాంగ్రెస్‌ మాట వింటాడా? ఈ ప్రతిపక్షాలన్నీ విఫలమైనాయి. ప్రస్తుతం తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. కనుక కచ్చితంగా మా పార్టీకి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. అందులో సందేహమే లేదు.


ఆర్కే: నమస్తే షర్మిల గారు  

షర్మిల: నమస్తే అన్న 


ఆర్కే:షర్మిల అనాలా? షమ్మీ అనాలా? 

షర్మిల:  మీ ఇష్టం అన్నా. ఎలాగైనా పర్లేదు. 


ఆర్కే: ఇంట్లో వాళ్లందరూ షమ్మీ అని పిలుస్తారేమో కదా!  

షర్మిల:  అవునన్నా  


ఆర్కే: మీ నాన్న ఏమని పిలిచేవారు?

షర్మిల:  పాప్స్‌. పాప అని ముద్దుగా అలా అనేవారు. మిగతా బంధువర్గం అంతా షమ్మీ అని పిలుస్తారు. 


ఆర్కే: షమ్మీ నాన్న కూచా? 

షర్మిల:  అవునన్నా. చాలా! 


ఆర్కే: అంటే నాన్న నీ మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదటగా? 

షర్మిల:  నిజమే అన్నా. నాకేదన్నా బాధ కలిగితే నాకంటే ముందు ఆయన కళ్లల్లో నీళ్లు కనపడేవి. చాలా ప్రేమగా చూసుకున్నారు. 


ఆర్కే: మీ నాన్నతో అంత ఆప్యాయంగా ఉండేదానివి! అలాంటిది హఠాత్తుగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ మిస్సయిందనే వార్త తెలిసినప్పుడు అంతా షాక్‌లోకి వెళ్లిపోయుంటారు కదా! 

షర్మిల:  నిజానికి హెలికాప్టర్‌ మిస్సయిందన్నప్పుడు నేను వెంటనే ఎక్స్‌ప్లోషన్‌ ఏమైనా డిటెక్ట్‌ అయిందా అని ఎంక్వైరీ చేశాను. అలాంటిదేమీ లేదన్నారు. దాంతో నాకు వేరే అనుమానమే రాలేదు. భయపడలేదు. వానపడుతుంది... ఎక్కడో ఒక చోట ల్యాండ్‌ అయివుంటారు. కమ్యూనికేషన్‌ మనకు అందడంలేదనే అనుకున్నా. చుట్టుపక్కల వాళ్లంతా భయపడుతున్నారు కానీ... ‘ఏం కాదులే’ అని సెప్టెంబరు 2 రాత్రి నేను పడుకున్నా. అమ్మా వాళ్లందరూ ప్రేయర్‌ చేస్తున్నారు. మరుసటి రోజు తెల్లారి కూడా నేనసలు భయపడలేదు. అప్పుడు ఒకటి తరువాత మరొకటి తెలిసింది. చాలా షాకయ్యాను. తొమ్మిది నెలలపాటు విపరీతంగా బాధపడ్డాను. ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను. వాస్తవ పరిస్థితుల్లోకి రాలేకపోయాను. దాదాపు ఏడాది తరువాత గానీ మామూలు మనిషి కాలేకపోయాను. 


ఆర్కే: అప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయడం తదితర అంశాల గురించి తెలుసా? 

షర్మిల:  లేదన్నా. జగన్‌మోహన్‌రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు. ఆయన తరుఫున వేరేవారు చేశారు. పోరాడాల్సి వస్తుందని తెలుసు. పోరాడుతోంది పెద్ద పెద్ద వాళ్లతోనని తెలుసు. ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఒక పక్క అంతులేని బాధ... మరోపక్కన విభిన్న పరిస్థితులు... రెండిటినీ సమన్వయం చేసుకోవడం కష్టం కదా! (డీలింగ్‌ విత్‌ ద గ్రీఫ్‌ ఈజ్‌ డిఫరెంట్‌... డీలింగ్‌ విత్‌ ద సర్కమ్‌స్టెన్సెస్‌ ఈజ్‌ డిఫరెంట్‌). అన్నీ ఒక్కసారిగా వచ్చి మీద పడ్డాయి. 


ఆర్కే: వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అడిగినవారికి లేదనకుండా సాయం చేసే లక్షణం ఉంది. అలాంటి మనిషికి, దేవుడిని నమ్మే ఆ కుటుంబానికి ఇలా ఎందుకు జరిగిందంటారు? 

షర్మిల: తెలియదన్నా. మనం మనుషులం. మనకు అన్నీ అర్థంకావు. ఒకవేళ అర్థమైతే మనుషులం ఎందుకు అవుతాము? దేవుళ్లమైపోతాము కదా! కానీ నాన్న చాలా చాలా మంచి వ్యక్తి. 


ఆర్కే: స్కూల్‌ చదువంతా పులివెందులేనా? 

షర్మిల: లేదన్నా. ఫస్ట్‌ వరకు పులివెందుల. తరువాత కొన్నేళ్లు చెన్నై. హైస్కూల్‌, డిగ్రీ, పీజీ అన్నీ హైదరాబాద్‌లోనే. 


ఆర్కే:పీజీ ఎందులో? 

షర్మిల:  ఎంబీఏ, ఫైనాన్స్‌. 


ఆర్కే: మీ నాన్నలానే ఎవరి బాధలన్నా వింటే కరిగిపోవడం, ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయడం వంటి లక్షణాలు స్కూల్లో చదివే రోజుల నుంచే నీకు ఉన్నాయట కదా! నాకు తెలిసి ఆ రోజుల్లో... అంటే 1985 ప్రాంతంలో ఎవరో బిచ్చగాడిని చూసి వంద రూపాయలు ఇచ్చావట... గుర్తుందా? 

షర్మిల: అది గుర్తు లేదన్నా (నవ్వు). కానీ ఎవరైనా బాధల్లో ఉంటే నేను తట్టుకోలేను. చేతనైన సాయం చేస్తాను. అది మన బాధ్యత కూడా. 


ఆర్కే: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన నాన్న ఉన్నప్పుడే వచ్చిందా? 

షర్మిల:  లేదన్నా. చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలంటే అయిష్టత. ఎందుకంటే నాన్న చాలా బిజీగా ఉండేవారు. ఖాళీ ఉంటే మాత్రం నాతోనే ఉండేవారు. సో... ‘నన్ను నాన్న నుంచి దూరం చేస్తుంది రాజకీయాలే కదా. ఇందులోనే ఎందుకు ఉండాలి? వేరే ప్రొఫెషన్స్‌ ఉన్నాయి. అప్పుడైతే మాతోనే ఉంటారు కదా’ అనుకునేదాన్ని. కనీసం నాకు అసలు పాలిటిక్స్‌ అనే సబ్జెక్ట్‌ కూడా ఇష్టముండేది కాదు. ఆ చర్చల్లో కూడా ఎప్పుడూ పాల్గొనలేదు. నేనుంటే నాన్న కూడా ఆ విషయాలు మాట్లాడేవారే కాదు. 


ఆర్కే: మరి ఎప్పుడు వచ్చింది ఆసక్తి? 

షర్మిల:  ఈ మధ్యే వచ్చింది (నవ్వు). 


ఆర్కే:పరిస్థితుల వల్ల వచ్చిందా? 

షర్మిల: ఒక డిజైర్‌ వల్ల వచ్చింది. ఒకటి చేయాలనుకున్నాం కనుక వచ్చింది. 


ఆర్కే: తెలంగాణలో పార్టీ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? 

షర్మిల:  ఎందుకంటే... కేసీఆర్‌ గారు కరోనా సమయంలో చాలా అసమర్థంగా వ్యవహరించారు. జాతీయ మీడియా కూడా చెప్పింది... ‘కేసీఆర్‌ టెస్టులు చేయడానికి కూడా సుముఖంగా లేరు’ అని. అది నన్ను కలవరపెట్టింది. అప్పుడు మిత్రుడు, రాజకీయ వ్యూహకర్త నాతో ఒకటి చెప్పారు... ‘కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రత్యామ్నాయం లేకపోవడం. ఆయన పాలనవల్లో, మంచితనంవల్లో మెచ్చి ఓట్లు వేయలేదు’ అని. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా విఫలమైనట్టు. ఈ పరిస్థితి మార్చాలనుకున్నా. 


ఆర్కే: మరి తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్‌ ఉందా? 

షర్మిల:  ఎందుకు లేదన్నా! ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షమే లేదు. ఈ రోజు కాంగ్రెస్‌... పార్టీగా కాకుండా ‘కాంగ్రెస్‌ సప్లయింగ్‌ కంపెనీ’గా మారింది. కేసీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్‌. అది ప్రతిపక్షమెలా అవుతుంది? బీజేపీ అంటారా..! బండి సంజయ్‌ గారేమో కేసీఆర్‌ అవినీతి మీద నా దగ్గర వంద ఆధారాలున్నాయంటారు. ఒక్కటి కూడా బయటపెట్టరు. రేవంత్‌రెడ్డి గారు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆయన పార్టీ ప్రెసిడెంట్‌. రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు... మెడ తీసేయగలడు. అలాంటివాడు కేసీఆర్‌ మాట వింటాడా? కాంగ్రెస్‌ మాట వింటాడా? ఈ ప్రతిపక్షాలన్నీ విఫలమైనాయి. ప్రస్తుతం తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. కనుక కచ్చితంగా మా పార్టీకి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. అందులో సందేహమే లేదు. 


ఆర్కే:నాన్నలా షమ్మీలో కూడా పట్టుదల ఉంది. కానీ రాష్ట్రం విడిపోయాక ఇక్కడ తెలంగాణకు సంబంధించిన భావజాలం, భావోద్వేగాలు కొన్ని ఉన్నాయి. దాన్ని కేసీఆర్‌ గరిష్ఠంగా వాడుకున్నాడు. అవసరం వచ్చినప్పుడు మళ్లీ రెచ్చగొడుతుంటాడు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు కనుక ఆయన కూతురుగా షర్మిలకు ఇక్కడ అర్హత లేదన్నది వాళ్ల వాదన. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? 

షర్మిల: అన్నా... మీలాంటి పెద్దలు వైఎస్సార్‌ గారు వ్యతిరేకి అంటున్నారంటే... దానికి అర్థం కేసీఆర్‌ గారు వైఎస్సార్‌ని ఎంత విజయవంతంగా తెలంగాణకు వ్యతిరేకి అని బ్రాండింగ్‌ చేశారో అర్థం చేసుకోండి. ఇది కేసీఆర్‌ గారు వైఎస్సార్‌ మీద వేసిన ముద్ర. వైఎస్సార్‌ అసలు తెలంగాణకు వ్యతిరేకి ఎలా అవుతారు? 1999లోనే వైఎస్సార్‌ సంతకాలు పెట్టి పంపించారు. అప్పటికి టీఆర్‌ఎస్‌ పుట్టను కూడా పుట్టలేదు. తెలంగాణ అవసరం ఉందని 2004, 2009 మేనిఫెస్టోల్లో పెట్టారు. 2004లో కేసీఆర్‌ పొత్తు పెట్టుకున్నప్పుడు వైఎస్సార్‌ దేవుడు. 2009లో పొత్తు లేనప్పుడు తెలంగాణకు వ్యతిరేకి. అదే తరహాలో చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటేనేమో ఆయన దేవుడు. తరువాతి ఎన్నికల్లో చంద్రబాబు గారు ఆంధ్రా పార్టీనా? కేసీఆర్‌ అవసరం వచ్చినప్పుడు నాలుక ఎటు పడితే అటు తిప్పుతుంటారు. వైఎస్సార్‌ ఎప్పుడూ ఈ ప్రాంతం... ఆ ప్రాంతం అని చూడలేదు. ఎక్కువ బోర్లు తెలంగాణలో ఉన్నాయని తెలిసే ఉచిత విద్యుత్తు ఫైల్‌పై తొలి సంతకం పెట్టారు. ప్రాజెక్టులు కూడా తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ ఇచ్చారు. నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన తెలంగాణ ప్రజల్లో తీసెయ్యడానికి వైఎస్సార్‌ చాలా ప్రయత్నించారు. 


ఆర్కే: ఈ వాదనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలననే నమ్మకం ఉందా? ‘షర్మిల మా బిడ్డే’ అనిపించుకోగలరా? 

షర్మిల:  కచ్చితంగా. దానికి నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్సార్‌ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నా పనిని సులువు చేశాయి. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను ఇక్కడి వారు అనుభవించారు. నన్ను చూస్తేనే మా నాన్న గుర్తొస్తారు. మా నాన్నను చూస్తే ఆయన సంక్షేమం గుర్తొస్తుంది. తెలంగాణ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొంటారన్న నమ్మకం ఉంది. 


ఆర్కే:ఎవరితోనూ పొత్తులు అవసరం లేదంటారు! 

షర్మిల: అక్కర్లేదన్నా. 

షర్మిల ఓపెన్ హార్ట్ పార్ట్-2: నాకు... అన్నకు మధ్య వంద ఉండవచ్చు. వెయ్యి ఉండవచ్చు. విభేదాలు ఎవరికి ఉండవన్నా..?.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

రాజకీయ నేతలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.