ప్రజా సమస్యలు పరిష్కరించలేని సీఎం ఎందుకు : వైఎస్‌ షర్మిల

ABN , First Publish Date - 2022-09-27T05:29:42+05:30 IST

ప్రజా సమస్యలను పరిష్కరించలేని సీఎం కేసీఆర్‌ మనకెందుకని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. సోమవారం ఆమె సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌ గ్రామం నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు కోసం తన పొలాన్ని ట్రాక్టర్లతో దున్ని ధ్వంసం చేశారని, తనకు న్యాయం చేయాలని రైతు చంద్రమోహన్‌ ఆమెకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కంది మండలం ఆరుట్లలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించి చిద్రుప్ప, బేగంపేటకు చేరుకున్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించలేని సీఎం ఎందుకు : వైఎస్‌ షర్మిల

సంగారెడ్డిరూరల్‌/ కంది, సెప్టెంబరు 26: ప్రజా సమస్యలను పరిష్కరించలేని సీఎం కేసీఆర్‌ మనకెందుకని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. సోమవారం ఆమె సంగారెడ్డి మండలం కులబ్‌గూర్‌ గ్రామం నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డు కోసం తన పొలాన్ని ట్రాక్టర్లతో దున్ని ధ్వంసం చేశారని, తనకు న్యాయం చేయాలని రైతు చంద్రమోహన్‌ ఆమెకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కంది మండలం ఆరుట్లలో ఏర్పాటు చేసిన  వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించి చిద్రుప్ప, బేగంపేటకు చేరుకున్నారు. బేగంపేటలో ప్రజలతో మాటా మంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రజా సమస్యలను గాలికి వదిలి ఫాంహౌ్‌సలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ఓటేసి మళ్లీ మోసపోవద్దని సూచించారు. బీజేపి, కాంగ్రెస్‌ కూడా ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే వైఎ్‌సఆర్‌ సంక్షేమ పాలన అందిస్తామని స్పష్టం చేశారు. తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.

Updated Date - 2022-09-27T05:29:42+05:30 IST