తెలంగాణలో చదివిస్తే ప్రాణాలు పోతున్నాయని ఏడుస్తున్నారు: షర్మిల

ABN , First Publish Date - 2021-07-21T00:48:07+05:30 IST

తెలంగాణలో చదివిస్తే తమ పిల్లల ప్రాణాలు పోతున్నాయని తల్లులు ఏడుస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు

తెలంగాణలో చదివిస్తే ప్రాణాలు పోతున్నాయని ఏడుస్తున్నారు: షర్మిల

హైదరాబాద్: తెలంగాణలో చదివిస్తే తమ పిల్లల ప్రాణాలు పోతున్నాయని తల్లులు ఏడుస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. చదవకుండా ఉంటే తమ పిల్లలు ఎలా బ్రతుకుతారని వారు ఆందోళన చెందుతున్నారని షర్మిల పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై  షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగులవి ప్రాణాలు కావా అని ఆమె ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదా అని నిలదీశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ వాడే బాత్ రూం బుల్లెట్ ప్రూఫ్ అట అని, ఆయనకు తన ప్రాణాల మీద అంత తీపి ఉందని ఆమె వ్యంగంగా వ్యాఖ్యానించారు.


ఎవరేమైతే నాకేంటి అనే ఆలోచన కేసీఆర్‌దని ఆమె విమర్శించారు. తెలంగాణలో చదివిస్తే ప్రాణాలు పోతున్నాయని తల్లులు ఏడుస్తున్నారని ఆమె పేర్కొన్నారు.  చదవకుండా ఉంటే తమ పిల్లలు ఎలా బ్రతుకుతారని వారు ఆందోళన చెందతున్నారన్నారు. సోయిలేని సీఎం కేసీఆర్, ఆయనది గుండె కాదు బండ అని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్లు వేయనందుకు ఏడేళ్ల తప్పుగా వయోపరిమితిని ఏడేళ్లకు పెంచాలని షర్మిల డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-07-21T00:48:07+05:30 IST