Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 12 2021 @ 19:46PM

కేసీఆర్‌కు అంబేద్కర్ అంటే లెక్కలేదు: షర్మిల

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ అంటే లెక్కలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తిరుమల‌గిరిలో దళితభేరి బహిరంగ సభలో ఆమె సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో  కేసీఆర్ ఒక్కసారి కూడా అంబేద్కర్ విగ్రహానికి దండవేయలేదన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కక్కుర్తి పడ్డారని షర్మిల ఆరోపించారు. సీఎం చేస్తానని చెప్పి దళితులకి ఆశ చూపి కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.


కేసీఆర్ సలహాదారుల్లో ఒక్క దళిత వ్యక్తి కూడా లేరని విమర్శించారు. మహిళలను గౌరవించడం టీఆర్ఎస్‌కు తెలీదని ఎద్దేవా చేశారు. పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ల్యాండ్ బ్యాంకు కోసం భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. వేల కోట్లు విలువ చేసే భూముల్ని బినామీలకు అప్పగిస్తున్నారని షర్మిల తెలిపారు. ఉద్యమంలో పోరాడింది దళితులేనని గుర్తు చేశారు. ఉద్యమాన్ని నిడిపించింది దళిత జాతి బిడ్డలేనన్నారు. పోరాటమే శ్వాసగా ఉద్యమకారులు పోరాడారని తెలిపారు. Advertisement
Advertisement