సీఎం కేసీఆర్‌ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తా: షర్మిల

ABN , First Publish Date - 2021-09-15T19:50:38+05:30 IST

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ప్రకంపనలు రేగుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తా: షర్మిల

హైదరాబాద్‌: సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనపై ప్రకంపనలు రేగుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. చిన్నారి కుటుంబాన్ని తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ స్పందించేంతవరకు నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 కోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే ఇట్లా ఉంటే... ఇక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని నిలదీశారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారికి పోస్టుమార్టం చేశారని విమర్శించారు. సీఎం ఇంట్లో కుక్క హస్కీ చనిపోతే డాక్టర్‌ ఉద్యోగం తొలగించారని, మరి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగితే సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించరని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - 2021-09-15T19:50:38+05:30 IST