ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిల మద్దతు

ABN , First Publish Date - 2021-12-30T01:04:07+05:30 IST

ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిల మద్దతు ఇచ్చారు. జీఓ 317ను రద్దు చేయాలని, జీఓ 317 తప్పుల తడకగా ఉందని షర్మిల అన్నారు.

ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిల మద్దతు

హైదరాబాద్‌: ఉపాధ్యాయ సంఘాలకు వైఎస్ షర్మిల మద్దతు ఇచ్చారు. జీఓ 317ను రద్దు చేయాలని, జీఓ 317 తప్పుల తడకగా ఉందని షర్మిల అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలని తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. స్థానికులనే స్థానికేతరులను చేసింది జీఓ 317 అన్నారు. పుట్టిన ఊరు, చదువుకున్న ఊరు స్థానికత కాదని ఎలా చెప్తారు? అని ఆమె ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసం జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెడుతున్నారని చెప్పారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో మరో 20-30 ఏళ్ల వరకు జిల్లా స్థాయి పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉండదన్నారు. నిరుద్యోగ యువతను ఇంకా చంపాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-30T01:04:07+05:30 IST