Abn logo
Sep 28 2020 @ 17:05PM

ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వాలని ప్రధానికి జగన్ లేఖ

Kaakateeya

అమరావతి : లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాశారు. లేఖలో ఆయన పలు భాషల్లో పాడిన పాటలు, పద్మభూషణ్, జాతీయ, ఫిల్మ్‌వేర్ అవార్డుల విషయాలను జగన్ ప్రస్తావించారు.

లేఖలో ఏముంది..!?

ఎస్పీ బాలు ఎంతో మంది వర్ధమాన గాయకులను పరిచయం చేయడంతో పాటు 50 సంవత్సరాల పాటు సంగీత ప్రేమికులను అలరించారు. మాతృభాషలో 40వేలకు పైగా పాటల పాడి, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఎన్నో గీతాలను ఆలపించారు. ఆరు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 నంది అవార్డులతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక అవార్డులు పొందారు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, పద్మభూషణ్ 2011లో బాలుకు ప్రదానం చేశారు. ప్రముఖ నేపథ్య గాయకులయిన లతా మంగేష్కర్, భుపెన్ హజారిక, ఎమ్మెస్ సుబ్బలక్ష్మీ, బిస్మిల్లా ఖాన్, భీమ్‌సేన్ జోషిలకు భారతరత్న అవార్డులు భారత ప్రభుత్వం అందజేసింది. ఐదు దశాబ్ధాల పాటు గాయకుడిగా అలరించిన బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతున్నాముఅని లేఖలో జగన్ వివరించారు. 
Advertisement
Advertisement