Abn logo
Sep 28 2021 @ 20:04PM

జగన్ వర్సెస్ పవన్.. రంగంలోకి సినీ ఆర్టిస్టులు కూడా..!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మకాలు జరపాలని జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అంశం జనసేన, వైసీపీ మధ్య మాటల తూటాల పేలాయి. తనపై ఉన్న కోపంతోనే జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందుకు మంత్రులు పేర్నినాని, బొత్స సత్యనారాయణ, అనిల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయితే పోసాని కృష్ణ మురళి ఎంట్రీకావడంతో సీన్ మరింత వేడెక్కింది. అంతేకాదు పవన్ కల్యాణ్‌పై పోసాని ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో బూతులు పెడుతూ తనకు మెసేజులు పెడుతున్నారని పవన్ అభిమానులపై పోసాని ఆరోపించారు. తాజాగా మరోసారి సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్, ఆయన అభిమానులపై మరింతగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘ పవన్, జగన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం. పవన్‌పై వ్యక్తిత్వ హననానికి దిగుతున్న వైసీపీ. సినీ ఆర్టిస్టుల్ని కూడా రంగంలోకి దించిన జగన్. పవన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏకపక్ష ఎటాక్. అన్ని అస్త్రాలతో రంగంలోకి దిగుతున్న జనసైన్యం.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...