Abn logo
Nov 24 2020 @ 12:40PM

25కోట్ల కారులో వెళ్తూ.. చెట్టును గుద్దేసిన యూట్యూబర్!

ఇంటర్నెట్ డెస్క్: అప్పుడప్పుడు మనం అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. వాటిని మర్చిపోయి ముందుకు సాగుతుండాలంతే.. ఈ మాటలు మామూలుగా చెప్తే పెద్దగా ప్రభావం చూపవుకానీ, ఓ 25 కోట్ల రూపాయల కారును చెట్టుకు గుద్ది, అది నుజ్జునుజ్జు అయి, చెయ్యి విరిగిన తర్వాత చెప్తే? ఆ మాటలకు చాలా అర్థం ఉంటుంది కదా. సరిగ్గా ఇలానే జరిగింది అమెరికాలో. గేజ్ గిలియన్ అనే యూట్యూబర్.. తన తండ్రి కారు పాగాని యేరా రోడ్‌స్టర్ సూపర్ కారులో చక్కర్లు కొడుతున్నాడు. ఇంతలో ఏమైందో ఆ కారు అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న ఓ చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గేజ్ చెయ్యి విరిగింది.


టైరులో ప్రెజర్ తక్కువగా ఉండటం వల్లే కారు అదుపు తప్పిందని, ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టిందని గేజ్ చెప్పాడు.  రూ.25కోట్ల కారు పచ్చడి పచ్చడి అయిపోయిన ఫొటోను, తనకు జరిగిన ప్రమాదం కథను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘ఒక్కోసారి ఇలాంటి చెత్త ఘటనలు జరుగుతుంటాయి. వాటిని తప్పించుకోలేం. కానీ జీవించడానికి మరో అవకాశం ఇచ్చిన భగవంతుడికి మాత్రం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా’ అని గేజ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement