అమెరికన్ సెనేటర్ ఖాతాను సస్పెండ్ చేసిన యూట్యూబ్!

ABN , First Publish Date - 2021-08-12T22:45:44+05:30 IST

ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్ ఓ అమెరికన్ సెనేటర్ ఖాతాను సస్పెండ్ చేసింది.

అమెరికన్ సెనేటర్ ఖాతాను సస్పెండ్ చేసిన యూట్యూబ్!

వాషింగ్టన్: ప్రముఖ సామాజిక మాధ్యమం యూట్యూబ్ ఓ అమెరికన్ సెనేటర్ ఖాతాను సస్పెండ్ చేసింది. కోవిడ్-19పై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు గాను కెంటుకీకి చెందిన రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ ఖాతాను వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు యూట్యూబ్ వెల్లడించింది. మాస్క్ ధరించడంపై రాండ్ చేసిన వ్యాఖ్యలు జనాలకు తప్పుడు సమాచారం చేరవేసేదిగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, వైరస్ వ్యాప్తిని మాస్క్ అడ్డుకోలేదని రాండ్ ఓ వీడియోలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఆయన ఖాతాను వారం రోజులు సస్పెండ్ చేసింది. 



Updated Date - 2021-08-12T22:45:44+05:30 IST