యూట్యూబ్‌ మ్యూజిక్స్‌లో ‘అదర్‌ పర్ఫార్మెన్సెస్‌’!

ABN , First Publish Date - 2022-08-06T05:56:00+05:30 IST

యూట్యూబ్‌ మ్యూజిక్స్‌లో ‘అదర్‌ పర్ఫార్మెన్సెస్‌’ పేరిట కొత్త విభాగం కనిపిస్తోందని సమాచారం. ఒక పాటకు సంబంధించి ఇతర పర్ఫార్మెన్సెస్‌ - ప్లే లిస్ట్‌లోని ప్లేయింగ్‌ సెక్షన్‌లో దర్శనమిస్తున్నాయి. యూ మైట్‌ ఆల్సో లైక్‌,..

యూట్యూబ్‌ మ్యూజిక్స్‌లో ‘అదర్‌ పర్ఫార్మెన్సెస్‌’!

యూట్యూబ్‌ మ్యూజిక్స్‌లో ‘అదర్‌ పర్ఫార్మెన్సెస్‌’ పేరిట కొత్త విభాగం కనిపిస్తోందని సమాచారం. ఒక పాటకు సంబంధించి ఇతర పర్ఫార్మెన్సెస్‌ - ప్లే లిస్ట్‌లోని ప్లేయింగ్‌ సెక్షన్‌లో దర్శనమిస్తున్నాయి. యూ మైట్‌ ఆల్సో లైక్‌, రికమెండెడ్‌ ప్లేలిస్ట్స్‌ కింద ఈ విభాగం ఉంది. కాన్సర్ట్‌ క్లిప్స్‌, లైవ్‌ పర్ఫార్మెన్సెస్‌, కవర్స్‌, రీమిక్సెస్‌ తదితరాలు వివిధ పాటలకు సంబంధించి  ఉన్నాయి. కొద్ది నెలల క్రితం నుంచి ఇది అందుబాటులో ఉంది అయితే ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌కు తోడు వెబ్‌లోనూ ఇప్పుడు ఉంది. దీన్ని మొదట 9టు5గూగుల్‌ గుర్తించింది.


ప్రసిద్ధి చెందిన అలాగే ప్రముఖ గాయకులకు చెందిన పాటలు, ఆర్టిస్టులకు సంబంధించిన విశేషాలు ఆడియో, వీడియో రూపంలో లభిస్తున్నాయి. పాట ప్లే అవుతున్నప్పుడు సంబంధిత టాబ్‌ కనిపిస్తుంది. తొందరగా స్ర్కోలింగ్‌ చేస్తే ‘యూ మైట్‌ ఆల్సో లైక్‌’, రికమెండెడ్‌ ప్లేలిస్ట్స్‌’ కనిపిస్తాయి. అక్కడే అదర్‌ పర్ఫార్మెన్సెస్‌ జాబితా పాటకు చెందినవి ఉంటాయి. ఇది కాకుండా ఆండ్రాయిడ్‌ కోసం యూట్యూబ్‌ మ్యూజిక్‌ యాప్‌లోనే ‘స్లీపర్‌ టైమర్‌’ ఫీచర్‌పై పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ స్లీపర్‌ టైమర్‌తో కాలాన్ని సెట్‌ చేసుకోవచ్చు. తమ ట్రాక్స్‌కు బ్రేక్స్‌ను కూడా షెడ్యూల్‌ చేసుకోవచ్చు.   

Updated Date - 2022-08-06T05:56:00+05:30 IST