కాంగ్రెస్‌లో యువకులు, మహిళలకు పెద్ద పీట

ABN , First Publish Date - 2022-05-24T06:23:38+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో బడుగు బలహీనవర్గాలు, యువకులు, మహిళలకు పెద్దపీట వేస్తున్నామని పంచాయతీ రాజ్‌ సంఘటన రాష్ట్ర కన్వీనర్‌ అమర్‌ జహాబేగ్‌ మహ్మద్‌ అన్నారు.

కాంగ్రెస్‌లో యువకులు, మహిళలకు పెద్ద పీట

కొవ్వూరు, మే 23: కాంగ్రెస్‌ పార్టీలో బడుగు బలహీన వర్గాలు, యువకులు, మహిళలకు పెద్దపీట వేస్తున్నామని పంచాయతీ రాజ్‌ సంఘటన రాష్ట్ర కన్వీనర్‌ అమర్‌ జహాబేగ్‌ మహ్మద్‌ అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిమిత్తం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు సోమవారం కొవ్వూరు మండలం కాపవరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు ఎండీ రఫీయుల్లా బేగ్‌, రాజీవ్‌గాంధీ,.. అమర్‌ జహాబేగ్‌ మహ్మాద్‌తో సమావేశమయ్యారు. మహ్మాద్‌ మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏ.అరుణ్‌ను తూర్పుగోదావరి జిల్లా సంస్థాగత ఎన్నికల పర్యవేక్షణాధికారిగా నియమించడంతో సోమవారం జిల్లా పర్యటనకు వచ్చినట్టు చెప్పారు. దేశంలో దళితులు, యువకులపై రుగుతున్న దాడులను నివారించాలన్నా, నిత్యవసర ధరలను అరికట్టాలన్నా, సగటు మానవునికి ఉపాధి కల్పించాలన్నా కాంగ్రెస్‌ పార్టీ మరలా అధికారంలోకి రావాల న్నారు. రానున్న ఎన్నికల్లో యువకులు, మహిళలకు 50 శాతం సీట్లను కేటాయించనున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో సగటు మనిషి బతకలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు మహిళలకు పెనుభారంగా మారాయన్నారు. ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న అభ్యర్థుల ఓటింగ్‌ ద్వారా మండల, నియోజకవర్గ, జిల్లా అధ్యక్షుల నియామకం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గోపాలపురం ఇన్‌చార్జి సతీష్‌బాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ పుట్టా రామారావు, ఎం. మోహనరావు, కాకర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:23:38+05:30 IST