అల్లూరి స్ఫూర్తితో యువత పోరాడాలి

ABN , First Publish Date - 2022-07-05T05:33:14+05:30 IST

అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో సమస్యల సాధనకోసం పోరాడాలని సీపీఎం జమ్మలమడుగు కార్యదర్శి శివనారాయణ పిలుపునిచ్చారు.

అల్లూరి స్ఫూర్తితో యువత పోరాడాలి
జమ్మలమడుగు: అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పిస్తున్న సీపీఎం నాయకులు

జమ్మలమడుగు రూరల్‌, జూలై 4: అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో సమస్యల సాధనకోసం పోరాడాలని సీపీఎం జమ్మలమడుగు కార్యదర్శి శివనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎన్జీవో కార్యాలయం ఆవరణలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  విప్లవం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నమ్మిన మన్యం వీరుడన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దాసరి విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోరుమామిళ్ల:  పోరుమామిళ్ల  మండలంలోని రా మాయపల్లె ఎంపీపీ పాఠశాలలో ప్రధానోపాధ్యా యుడు తుపాకుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటలు పాటలు, ఏకపాత్రాభి నయాలు, దేశభక్తి గీతాలాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెజీ నా అనే  విద్యార్థిని ప్రదర్శించిన అల్లూరి సీతారామ రాజు ఏకపాత్రాభినయం అందరినీ ఆకట్టుకుంది.  

ఖాజీపేట:  దుంపలగట్టులో సోమవారం టీడీపీ నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో టీడీపీ నేతలు సుబ్బారెడ్డి, రెడ్యం నాగేశ్వరరెడ్డి, ఇండ్ల వెంకటరెడ్డి, తప్పెట కృష్ణారెడ్డి, బండి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మైదుకూరు: అల్లూరి సీతారామరాజు స్పూర్తితో  యువత తమ హక్కుల కోసం పోరాడాలని ఎస్‌ఎఫ్‌ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్‌ కుమార్‌ పిలుపు నిచ్చారు. అల్లూరి జయంతి సందర్భఃగా సోమ వారం స్థానిక సుందరయ్య కాలనీలో నివాళుల ర్పించారు. కార్యక్రమంలో  రాజా, విక్కి, రాహుల్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T05:33:14+05:30 IST