‘యువత క్రీడల్లో రాణించాలి’

ABN , First Publish Date - 2021-01-16T07:03:26+05:30 IST

యువత సామాజిక సేవలతో పాటు స్నేహభావం పెంపొందించుకునేందకు క్రీడల్లో రాణించాలని భైంసా రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌ అన్నారు.

‘యువత క్రీడల్లో రాణించాలి’
క్రీడలను ప్రారంభిస్తున్న భైంసా రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌

కుభీర్‌, జనవరి 15 :  యువత సామాజిక సేవలతో పాటు స్నేహభావం పెంపొందించుకునేందకు క్రీడల్లో రాణించాలని భైంసా రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని డొడర్న కిషాన్‌నాయక్‌తాండాలో మాజీసర్పంచ్‌ జాదవ్‌ గోగానాయక్‌ జ్ఙాపకార్థం నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంటును ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు జాదవ్‌ అజయ్‌ కుమార్‌  సిర్పెల్లి సర్పంచ్‌ బాలాజీ, స్థానిక సర్పంచ్‌ సునితగణపత్‌, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి, యువజన సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

కుంటాల :  కుంటాల మండలంలోని దౌనెల్లి తాండాలో యువకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను  భైంసా రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌  ప్రారం భించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈయన వెంట ఎస్సై శ్రీకాంత్‌, సర్పంచ్‌ హైమ్మద్‌, తదితరులున్నారు. 

తానూర్‌ : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక ధృఢత్వం కలుగు తుందని తానూర్‌ ఎస్సై రాజన్న అన్నారు. మండలంలోని ఝరి(బి) గ్రామంలో అజాద్‌కబడ్డీ టౌర్నమెంటు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతి అందజేశారు ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ జెల్లావార్‌ చంద్రకాంత్‌, స్థానిక సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మల్లారెడ్డి, దశరథం స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేత సుల్తాన్‌ జట్టు

నిర్మల్‌ టౌన్‌ : మల్లారెడ్డి, దశరథంల స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్మల్‌ పట్టణంలోని శాంతినగర్‌ జేవీఎన్‌ఆర్‌ విద్యానికేతన్‌ పాఠశాలలో గత 10 రోజుల నుండి సాగిన టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. ఫైనల్‌మ్యాచ్‌లో  సుల్తాన్‌ టీం విజేతగా నిలిచింది. 

Updated Date - 2021-01-16T07:03:26+05:30 IST