రక్తదానానికి యువత ముందుకు రావాలి

ABN , First Publish Date - 2022-08-18T06:17:20+05:30 IST

రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని, అది ఎందరికో ప్రాణదానం అవుతుందని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు.

రక్తదానానికి యువత ముందుకు రావాలి
సిరిసిల్లలో రక్తదానం శిబిరాన్ని పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌ పర్సన్‌, కలెక్టర్‌, ఎస్పీ

- జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 17: రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని, అది ఎందరికో ప్రాణదానం అవుతుందని జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా  ప్రభుత్వాస్పత్రిలో రకాదనం శిబిరం ఏర్పాటు చేశారు.  జడ్పీ చైర్‌ పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి,  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్గే శిబిరాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ  స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిరిసిల్లలో 75 యూనిట్లు, వేములవాడలో 75 యూనిట్లు రక్తం చేకరించాలన్నారు.  జిల్లా అన్ని రంగాల్లో ముందుంటుందని, రక్తదానంలోనూ ముందు వరసలో ఉండాలని అన్నారు. జిల్లాలోని ప్రతీ పౌరుడు బాధ్యతగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలపునిచ్చారు. అంతకుముందు అనంతరం రక్తదానం చేసిన యువకులకు ప్రశంస పత్రాలు, పండ్లను పంపిణీ చేశారు.

రక్తదానం సమాజ సేవ 

రక్తదానం సమాజానికి సేవ చేయడేమేనని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.  రక్త్తదానం చేయడానికి మిషన్‌ భగీరథ ఉద్యోగులు, పోలీస్‌శాఖ ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.   శిబిరంలో 47 మంది మిషన్‌ భగిరథ ఉద్యోగులు, 25 మంది పోలీస్‌శాక ఉద్యోగులు, 80 మంది యువకులు రక్తదానం చేశారు.  కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుమన్‌ మోహన్‌రావు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మురళీఽధర్‌రావు, సిరిసిల్ల పట్టణ, రూరల్‌ సీఐలు అనిల్‌కుమార్‌, ఉపేందర్‌, నోడల్‌ అధికారి శ్రీనివాస్‌, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, వైద్యులు, రెడ్‌క్రాస్‌ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T06:17:20+05:30 IST