స్వాతంత్ర్యోద్యమంలో యువత కీలక పాత్ర

ABN , First Publish Date - 2022-08-12T05:02:54+05:30 IST

స్వాతంత్య్ర ఉద్యమంలో యువత పాత్ర కీలక మని కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌రావు అన్నారు.

స్వాతంత్ర్యోద్యమంలో యువత కీలక పాత్ర
పంగులూరులో త్రివర్ణ పతాకంతో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

అద్దంకి, ఆగస్టు 11: స్వాతంత్య్ర ఉద్యమంలో యువత పాత్ర కీలక మని కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌రావు అన్నారు. అజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా గురువారం డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, శింగరకొండపాలెం పాఠశాల విద్యార్థులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించిన నేతల గురించి వివరించారు. కార్యక్ర మంలో ఎన్‌సీసీ యూనిట్‌ 1,2 అధికారులు డాక్టర్‌ ప్రభుదాస్‌, అనిత, అధ్యాపకులు రవీం ద్ర, గంగయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


 విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలి

పంగులూరు, ఆగస్టు 11: విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవా లని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గురువారం మండలంలోని పంగు లూరు, చందలూరు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు, ఎన్‌సీసీ విద్యార్థులు జాతీయ జండాలను చేతబూని త్రివర్ణ పతాకంతో ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంగులూరు హైస్కూల్లో చిలు కూరి రాములు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 350  మంది విద్యార్థులకు లక్ష రూపాయల విలువైన పుస్తకాలను చిలుకూరి శ్రీధర్‌ చేతుల మీదగా పంపిణీ చేశారు. విశ్రాంత ఇంజనీర్‌ సుంకర సుధాకర్‌, విశ్రాంత ఉపా ధ్యాయుడు చంబయ్య రూ.25 వేల విలువచేసే బీరువాను స్కూలుకు బహూకరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు రాలు కె.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 

మార్టూరు: ఆజాదీకా అమృత మహాత్సవ వేడుకలలో భాగంగా గురువారం స్థానిక జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు త్రివర్ణ పతాకం చేత బూని ర్యాలీ నిర్వహించారు. విద్యార్దులలో దేశభక్తి పెరగాలని ఉపా ధ్యాయులు వివిధ రూపాలలో విద్యార్థులకు తెలియచేశారు.  కార్యక్ర మంలో హెచ్‌ఎం పి.డేవిడ్‌,  పీడీ శ్రీనివాస్‌, గిరి  పాల్గొన్నారు. 

ఇంకొల్లు: 23వ ఆంధ్ర బెటాలియన్‌ ఆఫీసర్‌ ఆదేశాల మేరకు ఎన్‌సీసీ ఆఫీసర్‌ ఎ.శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో క్యాడెట్స్‌, విద్యార్థులు ఇంకొల్లులో ర్యాలీ నిర్వహించారు. సుమారు 450 మందితో జాతీయ జండాలు, ప్ల కార్డులతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.రాధారాణి, పిఈటీ మధుమూర్తి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

చినగంజాం: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఎ న్‌సీసీ విద్యార్థులు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భా గంగా గురువారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 23 ఆంధ్రా బెటా లియన్‌ ఎన్‌సీసీ అధికారి సుబ్బారావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం డి.రత్నకుమారి, ఉపాధ్యా యులు ఎస్‌.నరసింహారావు, ఎల్‌.శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాసదీక్షితులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:02:54+05:30 IST