యువతకు ఆదర్శం వీవీ గిరి

ABN , First Publish Date - 2022-08-11T04:19:26+05:30 IST

దేశానికి రాష్ట్రపతిగా, కార్మిక ఉద్యమానికి విశేషమైన సేవలు చేసిన స్వాతంత్య్ర సమరయోదుడు వీవీ గిరి నేటి యువతకు ఆదర్శప్రాయులని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు.

యువతకు ఆదర్శం వీవీ గిరి
వీవీ గిరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌, జేసీ, డీఆర్‌వో

నివాళులర్పించిన కలెక్టర్‌, జేసీ


రాయచోటి (కలెక్టరేట్‌), ఆగస్టు 10: దేశానికి రాష్ట్రపతిగా, కార్మిక ఉద్యమానికి విశేషమైన సేవలు చేసిన స్వాతంత్య్ర సమరయోదుడు వీవీ గిరి నేటి యువతకు ఆదర్శప్రాయులని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో వీవీ గిరి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డీఆర్‌వో సత్యనారాయణలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ దేశానికి రాష్ట్రపతిగా, కార్మిక ఉద్యమానికి విశేషమైన సేవలు చేసిన వీవీ గిరి ప్రసిద్ధుడైన వరాహగిరి వెంకటగిరి అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్‌ పట్టణంలోని ఒక తెలుగు కుటుంబంలో 1894లో జన్మించారన్నారు. 1913లో ఈయన యూనివర్సిటీ కళాశాల డబ్లిన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడని కానీ ఐర్లండ్‌లో సీఎన్‌ఫె్‌స ఉద్యమంలో పాల్గొని దేశ బహిష్కరణకు గురయ్యారన్నారు. భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా కార్మిక ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ఆయన నేటి యువతకు ఆదర్శప్రాయులని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌వో సత్యనారాయణ, కలెక్టరేట్‌ ఏవో బాలకృష్ణ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T04:19:26+05:30 IST