వివాహితతో ప్రేమాయణం.. ఆమెను కలిసేందుకు వెళ్లి భర్తకు దొరికిపోయిన వైనం.. ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-04-12T17:32:23+05:30 IST

ఆ యువకుడు ఓ వివాహితతో ప్రేమలో పడ్డాడు.. ప్రియురాలిని కలిసేందుకు తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు..

వివాహితతో ప్రేమాయణం.. ఆమెను కలిసేందుకు వెళ్లి భర్తకు దొరికిపోయిన వైనం.. ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..

ఆ యువకుడు ఓ వివాహితతో ప్రేమలో పడ్డాడు.. ప్రియురాలిని కలిసేందుకు తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు.. ఇటీవల అలాగే వెళ్లి ఆమె భర్తకు దొరికిపోయాడు.. దీంతో ఆ యువకుడు దారుణ పరిణామాలను ఎదుర్కొన్నాడు.. కొందరు స్నేహితుల సహాయంతో ఆ యువకుడిని కిడ్నాప్ చేసిన మహిళ భర్త అతడికి టార్చర్ చూపించాడు.. మూడ్రోజుల పాటు బంధించి ఉంచి చితక్కొట్టాడు.. నగ్నంగా మార్చి వీడియో తీశాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. 


హర్యానాలోని ఫతేబాద్‌కు చెందిన అంకిత్ అనే వ్యక్తి సమీప గ్రామానికి చెందిన పంకజ్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను తరచుగా కలిసేవాడు. ఆ విషయం పంకజ్‌కు తెలిసింది. దాంతో అతను అంకిత్‌పై నిఘా వేశాడు. గత మంగళవారం అంకిత్ పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా మరో నలుగురు స్నేహితులతో కలిసి అడ్డగించాడు. తుపాకీ చూపించి బెదిరించి కిడ్నాప్ చేశాడు. ఓ గదిలో బంధించి నలుగరూ అంకిత్‌ను తీవ్రంగా కొట్టారు. పలు ప్లేస్‌లు మారుస్తూ అంకిత్‌ను టార్చర్ పెట్టారు. 


అంకిత్‌ను నగ్నంగా మార్చి వీడియో తీశారు. అంకిత్ కనబడడం లేదని అతని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న పంకజ్.. అంకిత్‌ను వదిలేసి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-04-12T17:32:23+05:30 IST