కత్తులు, తల్వార్లతో అర్ధరాత్రి రోడ్డుపై చిందులు

ABN , First Publish Date - 2021-06-11T19:52:25+05:30 IST

అర్ధరాత్రి కొంత మంది యువకులు రోడ్డుపై కేక్‌ కటింగ్‌ కార్యక్రమాలు

కత్తులు, తల్వార్లతో అర్ధరాత్రి రోడ్డుపై చిందులు

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : కత్తులు, తల్వార్లతో కొందరు యువకులు అర్ధరాత్రి రోడ్లపై చిందులు వేశారు. స్నేహితుల పుట్టినరోజు సందర్భంగా మద్యం తాగి హల్‌చల్‌ చేశారు. సంబంధిత వీడియోలు సామాజికమాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. హబీబ్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి మాన్గార్‌ బస్తీకి చెందిన ఇద్దరు యువకుల జన్మదినం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి కొంత మంది యువకులు రోడ్డుపై కేక్‌ కటింగ్‌  కార్యక్రమాలు పెట్టారు. వీరిలో కొందరు మద్యం తాగి తల్వార్లు, కత్తులతో చిందులు వేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి కనీసం మాస్కులు కూడా లేకుండా గుం పులు గుంపులుగా డ్యాన్సులు చేశారు. ఆ దృశ్యాలను వీడియో కూడా తీసుకున్నారు. సంబంధిత వీడియోలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో వైరల్‌గా మారాయి. కత్తులతో నృత్యాలు చేస్తున్న వీడియోను చూసిన హబీబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గురువారం ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన తల్వార్లు, కత్తుల కోసం విచారణ మొదలు పెట్టా రు. వాటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2021-06-11T19:52:25+05:30 IST