జగన్‌.. జాబ్‌ ఎక్కడ..!

ABN , First Publish Date - 2022-05-17T17:09:37+05:30 IST

అధికారంలోకి వస్తే ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత...ఆ హామీని అటకెక్కించారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు..

జగన్‌.. జాబ్‌ ఎక్కడ..!

మూడేళ్లుగా క్యాలెండర్‌ కోసం యువత ఎదురుచూపులు

తెలుగు యువత నేత శ్రీరామ్‌ చినబాబు


విశాఖపట్నం, మే 16(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వస్తే ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత...ఆ హామీని అటకెక్కించారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు ఆరోపించారు. ఈ నేపథఽ్యంలో ‘జాబ్‌ ఎక్కడ... జగన్‌’ అనే నినాదంతో రాష్ట్రంలో యువతను జాగృతం చేస్తామన్నారు. సోమవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడచిన మూడేళ్లలో ఒక పరిశ్రమ రాలేదు సరికదా... ఉన్నవి కూడా వెళ్లిపోయాయన్నారు. జగన్‌కు ఎందుకు ఓటేశామా అని జనం ఇప్పుడు బాధపుడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసి వైసీపీకి అధికారం కట్టబెడితే కేవలం నలుగురు రెడ్లకు నాలుగు ప్రాంతాలు అప్పగించారని ఆరోపించారు. ముఖ్యమంత్రితో కలిపి ఐదుగురు రెడ్లే రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. అన్యాయం జరిగిన వర్గాలకు తెలుగు యువత అండగా ఉంటుందని చినబాబు అన్నారు. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ... ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోతే సీఎం జాబ్‌ నుంచి జగన్‌ను తొలగించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.

Updated Date - 2022-05-17T17:09:37+05:30 IST