Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైల్లో ఇంటికెళ్తున్న ఇద్దరు ఫ్రెండ్స్.. అర్ధరాత్రి 2 గంటలకు ఓ కుర్రాడిని నిద్రలేపి మరీ ప్రయాణికులు చెప్పింది విని మైండ్‌బ్లాక్..!

ఇంటర్నెట్ డెస్క్: ఇద్దరు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత తమ స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. రైలెక్కారు. రాత్రి సమయం కావడంతో.. సరదాగా కబుర్లు చెప్పుకుంటూనే భోజనం పూర్తి చేశారు. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 2 గంటలకు ఓ కుర్రాడిని నిద్రలేపిన తోటి ప్రయాణికులు.. అతడికి షాకింగ్ విషయం చెప్పారు. ప్రయాణికులు చెప్పింది విన్న అతడికి ఒక్కసారిగా మైండ్‌బ్లాక్ అయింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బెంగాల్‌లోని హూగ్లీ ప్రాంతానికి చెందిన పసాంజిత్ చౌదరి (22), అశోక్ అనే యువకులు..  ఔరంగాబాద్‌లో పని చేస్తున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ ఇద్దరు యువకులు.. తమ స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళ్లి.. హౌరా-అహ్మదాబాద్ రైలెక్కారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ.. రాత్రి భోజనం చేశారు. ఆ తర్వాత ఇద్దరు యువకులు పడుకున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి అశోక్‌ను నిద్రలేపిన తోటి ప్రయాణికులు.. తన స్నేహితుడు పసాంజిత్ చౌదరి గురించి షాకింగ్ విషయం చెప్పారు. 


డోర్ దగ్గర నిల్చొని ఉన్న పసాంజిత్ చౌదరి.. ట్రైన్ నుంచి కింద పడిపోయాడని చెప్పడంతో అశోక్ కంగుతిన్నాడు. ఈ క్రమంలోనే.. ఆ ట్రైన్ తదుపరి స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పసాంజిత్ చౌదరి విషయాన్ని అశోక్ రైల్వే పోలీసులకు చెప్పడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. రైల్వే పట్టాలపై గాలించారు. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పోలీసు అధికారులు.. పసాంజిత్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో తనతోపాటే ఇంటికి బయల్దేరిన స్నేహితుడు ఇకలేడని తెలుసుకుని అశోక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement