ఆగి ఉన్న రైలు బోగీలను తెల్లవారుజామున 4.30 గంటలకు శుభ్రం చేయడానికెళ్లిన కార్మికుడు.. లోపల దృశ్యం చూసి..

ABN , First Publish Date - 2022-01-21T22:52:55+05:30 IST

రైలు బోగీలను శుభ్రం చేసేందుకు ఎప్పటిలాగే ఓ కార్మికుడు తన డ్యూటీకి వెళ్లాడు. కోచింగ్ డీపోలో ఆగి ఉన్న రైలు బోగీలను శుభ్రం చేస్తూ.. తెల్లవారుజామున 4.30 గంటల వేళ పార్శళ్ల కోసం కేటాయించిన బోగీ దగ్గరు వెళ్లాడు. అనంతరం ఆ బోగీలో కనిపించిన దృశ్యం చూసి.. ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే

ఆగి ఉన్న రైలు బోగీలను తెల్లవారుజామున 4.30 గంటలకు శుభ్రం చేయడానికెళ్లిన కార్మికుడు.. లోపల దృశ్యం చూసి..

ఇంటర్నెట్ డెస్క్: రైలు బోగీలను శుభ్రం చేసేందుకు ఎప్పటిలాగే ఓ కార్మికుడు తన డ్యూటీకి వెళ్లాడు. కోచింగ్ డీపోలో ఆగి ఉన్న రైలు బోగీలను శుభ్రం చేస్తూ.. తెల్లవారుజామున 4.30 గంటల వేళ పార్శళ్ల కోసం కేటాయించిన బోగీ దగ్గరు వెళ్లాడు. అనంతరం ఆ బోగీలో కనిపించిన దృశ్యం చూసి.. ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులతోపాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న అధికారులు.. బోగీలోకి చూసి విస్తుపోయారు. కాగా.. సదరు కార్మికుడు,  ఉన్నతాధికారులు ఆ బోగీలో ఏం చూశారు? ఎందుకు షాకయ్యారనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


చిరిమిరి-బిల్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం బిల్సాపూర్ జిల్లాలోని స్టేషన్‌కు చేరింది. ప్రయాణికులందరూ దిగిన తర్వాత ఈ రైలు బోగీలను  అధికారులు కోచింగ్ డీపోకు తరలించారు. అక్కడ ఆ బోగీలను శుభ్రం చేసేందుకు ఓ కార్మికుడు ఉదయం 4.30 గంటలకే డ్యూటీకొచ్చాడు. అన్ని బోగీలను శుభ్రం చేసిన ఆ కార్మికుడు.. పార్శళ్ల కోసం కేటాయించిన బోగీని కూడా క్లీన్ చేసేందుకు వెళ్లాడు. అనంతరం ఆ బోగీలో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. బోగీలో యువకుడి మృతదేహాన్ని చూసి కంగుతిన్నాడు. వెంటనే తోటి కార్మికులకు తెలియజేయడంతోపాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. 



దీంతో రైల్వే పోలీసులు సహా రైల్వే ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తమం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. అతడు ఎవరు అనే దానిపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా రైలు బోగీలున కోచింగ్ డీపోకు తరలించిన తర్వాతే.. సదరు వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. అయితే.. అతడు ఆత్మహత్య చేసుకుని మరణించాడా? లేక ఎవరైనా చంపేసి ఆత్మహత్యగా చితీకరించే ప్రయత్నం చేశారా? అనే విషయాలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే తెలుస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రైలు బోగీలో మృతదేహం లభ్యం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




Updated Date - 2022-01-21T22:52:55+05:30 IST